అందమైన జలపాతం.. దాని వెనక నమ్మలేని విషాద గాథ
ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాల్లో కథలున్నాయి. అలాంటి ఓ వాటర్ ఫాల్స్ మన దేశంలోనే మేఘాలయలో ఉంది. మీరు దాన్ని చూసేందుకు వెళ్తే.. మీకు దాని వెనకున్న పురాణ విషాద గాథ తెలిసుంటే మంచిది. అప్పుడు ఆ జలపాతాన్ని మీరు చూసే కోణం మరోలా ఉంటుంది. ఇంతకీ అది ఏది? దాని వెనకున్న కథేంటి? మేఘాలయ ప్రజలు చెబుతున్న విషాద కథేంటి? పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తుంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో 90 శాతం మంది మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్‌ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ (plunge waterfall) జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి బాగుంటాయి. ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉంటే సమయం తెలియదు. స...