మరణం ఆసన్నమయ్యే ముందు యమధర్మరాజు నాలుగు సంకేతాలను పంపిస్తాడట..! అవేంటో మీకు తెలుసా?
పుట్టిన వారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ఎప్పుడో బోధించాడు. అయితే, మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమ ధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది. ఆయన మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడన్న భావన కలిగి ఉంటాము. కానీ.. ఇది సృష్టిధర్మం లోని భాగం మాత్రమే. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలను పంపుతారట. అవేంటో..మనం చూద్దాం.. ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది. యమునా నదీ తీరం లో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎపుడు చూసినా తాను చనిపోతానేమో అని.. ఎపుడు చనిపోతానో అని ఒక దిగులు గా ఉండేదట. ఈ విషయం లో దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేసాడట. అతని తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే, ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలియచేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్ప చెప్పేయాలనేది అతని ఆలోచన. అయితే, యమధర్మ రాజు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తు గా కొన్ని సంకేతాలను మాత్రం పంపగ...