హనుమాన్ చాలీసా


 


 


దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥


విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।





ఒక రోజు తులసీదాస్ నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.

                   ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. దీనిని గమనించిన హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు

Comments

Popular posts from this blog

Nice to meet you , Where you been , I'll Show incredible things

Social Bookmarking: Your Guide to Saving, Sharing, and Discovering the Web

Who is Neil Breen? Film Credits goes Viral on TikTok