ఒక సైకో డాక్టర్ గాడి క్రైమ్ కద | Telanagana Doctor Praveen Case
డిసెంబర్ 26, 2024
ఈ సమాజం ఎటు వెళుతుంది మనుషులే మృగాలు అవుతున్న తీరు చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రియురాలి కోసం ఓ డాక్టర్ చేసిన దారుణ చూస్తుంటే మానవత్వం అంతరించి పోతుందనే భయం వేయక మానదు ఆ డెవిల్ డాక్టర్ చేసిన కన్నింగ్ క్రైమ్ చూడండి
ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలం రామ్ నగర్ కు చెందిన కుమారికి బోడా ప్రవీణ్ అనే అనస్తేషియా డాక్టర్ తో 2019 లో పెళ్లి జరిగింది. ఈ డాక్టర్ ప్రవీణ్ స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజి తండ, ప్రవీణ్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప
ని చేస్తున్నాడు ప్రవీణ్ కుమారి దంపతులకు ఇద్దరు చిన్నారులు నాలుగేళ్ల కృషిక మూడేళ్ల కృతిక.
ని చేస్తున్నాడు ప్రవీణ్ కుమారి దంపతులకు ఇద్దరు చిన్నారులు నాలుగేళ్ల కృషిక మూడేళ్ల కృతిక.
ఇద్దరు ఆడపిల్లలే ఆ పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నారు అయితే ఎక్కువగా నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చేది ప్రవీణ్ ఆ క్రమంలోనే కేరళకు చెందిన sony ఫ్రాన్సిస్ అనే నర్సు తో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ బంధానికి దారి తీసింది .
ఇక ప్రియురాలి మోజులో ఎప్పుడూ sony కి ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్ లోకి వెళ్ళిపోయేవాడు అంతేకాదు రాత్రి సమయంలో అయితే ఎంజాయ్ చేయొచ్చని నైట్ డ్యూటీ వేయించుకునేవాడు మెల్లిగా భార్య పిల్లలను నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టాడు ప్రవీణ్ పిల్లల మీద విపరీతమైన ప్రేమ చూపించే ప్రవీణ్ మొత్తం ప్రియురాల మధ్యలో పడిపోయాడు, ఆమె లేకుండా గడపలేని స్థితికి చేరుకున్నాడు, అయితే ప్రవీణ్ బిహేవియర్ లో మార్పును గమనించిన భార్య కుమారికి అనుమానం కలిగింది వెంటనే ఆరాతీయగా అసలు విషయం బయటపడింది హాస్పిటల్లో నర్సు తో అక్రమ బంధం పెట్టుకున్నాడని తెలింది ఇదే విషయంపై భార్యను నిలదీయగా ఆమెతో గొడవ పెట్టుకున్నాడు అంతేకాదు ఆ హాస్పిటల్ లో పని మానేయాలని కుమారి ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది కానీ ప్రవీణ్ ఒప్పుకోలేదు ఈ విషయంపై భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి చివరకు ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి తనతో సఖ్యతగా ఉండడం లేదు వేరే మహిళతో వివాహితర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడని తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది
దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది ఇద్దరి మధ్య సఖ్యతను కుదిరిచారు పెద్దలు తాను భార్య పిల్లలను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు ఇక తన ఇంటి దగ్గర భార్యతో గొడవల గురించి ప్రియురాల సోనీకి చెప్పుకున్నాడు ప్రవీణ్ మన ఇద్దరం స్వేచ్ఛగా కలుసుకునే అవకాశం దొరకడం లేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను దూరం చేసుకోలేనని చెప్పాడు మనం హాయిగా కలిసి ఉండాలంటే నీ భార్య పిల్లలను తొలగించు అప్పుడే మనం కలుసుకోవచ్చు అని చెప్పింది sony , నాకు కూడా అప్పుడు ధైర్యంగా ఉంటుంది నీతోనే కలిసి ఉంటానని కూడా చెప్పింది sony దీంతో తన లవర్ చెప్పిందని ఏకంగా భార్యను బంగారంలా చూసుకున్న తన ముద్దులకే ఇద్దరు పాపలను కూడా చంపాలనుకున్నాడు నీచుడు.
అందుకోసం google లో తెగ వెతికాడు ఎంత డోస్ మత్తు మందును కలిపి ఇస్తే పోస్ట్ మార్టం లో దొరకవు వెంటనే ఎలా చనిపోతారని google లో వెతకడం మొదలు పెట్టాడు ప్రవీణ్ అలా వెతికిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాడు తన దగ్గరే మత్తు మందు ఉంటుంది కాబట్టి దాన్ని సిద్ధం చేసుకొని ఉంచాడు అయితే ఈ కుమారికి కాల్షియం ఇంజెక్షన్లు వేసుకోవడం అలవాటు డాక్టర్ సూచనతో అప్పుడప్పుడు నీరసంగా ఉన్న సమయంలో వాటిని వేసుకుంటూ ఉంటుంది దాన్ని అదునుగా చేసుకొని హత్య చేయాలి అనుకున్నాడు
ప్రవీణ్ ఇక పిల్లలను భార్యను హైదరాబాద్ లో చంపితే దొరికిపోతాను తోటి డాక్టర్లు స్నేహితులకు తెలుస్తుందని సెలవు పెట్టాడు ఏకంగా 10 రోజులు ముందే సెలవు పెట్టేసి కారులో తనకు సొంత ఊర్లో పనులు ఉన్నాయని బావోజీ తండాకి వెళ్ళాడు అక్కడే మే 26న కాల్షియం ఇంజెక్షన్ వేసుకోమని ఇంట్లో భార్య మీద ఒత్తిడి తెచ్చాడు కానీ తనకు బాగానే ఉందని కుమారి వద్దని వారించింది లేదు నీకు జ్వరం గా ఉన్నట్లుంది నీరసంగా ఉన్నావని చెప్పాడు లేదు నేను బాగానే ఉన్నాను వద్దని చెప్పింది అయితే ఆ తర్వాత తనకు నీరసంగా ఉందని కుమారి చెప్పగానే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వద్దాం పదా అంటూ కారులో కావాలని కంపన్ తీసుకెళ్లాడు ఇక అప్పటికే తనకు కాస్త నీరసంగా ఉంది ఆ తర్వాత ఆధార్ అప్డేట్ పని ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యాడు దారిలో వస్తున్న సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని కుమారి చెప్పింది అంతే ఇదే అదనిగా చేసుకొని బల్లేపల్లి సెంటర్ లోని ఓ మెడికల్ షాప్ లో కాల్షియం ఇంజెక్షన్ తీసుకున్నాడు చిరంజీవి మాత్రం రెండు కొన్నాడు సరిగ్గా మూడు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కోయలక దగ్గర కారును ఆపాడు కారు వెనక భాగంలో పడుకో ఇంజెక్షన్ చేస్తానన్నాడు,
ప్రవీణ్ ఆమె సరేనని తుంటికి ఇంజెక్షన్ చేయించుకోవాలని వెనక సీట్లో పడుకుంది అప్పుడే కాల్షియం ఇంజెక్షన్ రెడీ చేసిన తర్వాత మత్తు మందును కూడా ఎక్కిస్తూ ఉండగా భార్య కుమారి చూసింది ఆ క్షణమే అడిగేసింది అదేంటి ఏదో కలుపుతున్నావు నాకు ఏమీ వద్దని చెప్పింది ఏం పర్వాలేదు ఇది వేస్తే నీకు రియాక్షన్ కాకుండా ఉంటుంది యాక్టివ్ గా అవుతావని అబద్ధం చెప్పి మత్తు మందుని ఎక్కించేశాడు ప్రవీణ్,
దీంతో కాసేపటికే ఆమె మగతగా ఉందని నిద్ర వస్తుందని చెప్పి స్పృహ కోల్పోయింది ఆ తర్వాత మిగతా మత్తు మందును కూడా పరిమితికి మించి భార్య బాడీలోకి ఇంజెక్ట్ చేశాడు డాక్టర్ ప్రవీణ్ ఆ తర్వాత అత్యంత దారుణమైన పని చేశాడు ఇది గాని వింటే వీడు అసలు మనిషేనా అంటారు వెనక డోర్ క్లోజ్ చేసేసి ముందుకు వచ్చాడు నీచుడు పిల్లలు హాయిగా ఆడుకుంటూ ఉంటే వారిని ఒకరి తర్వాత ఒకరిని ఒళ్ళలో కూర్చోబెట్టుకొని ముక్కు నోరు మూసి అత్యంత కర్కసంగా చంపాడు తనకు తానుగా ప్రేమగా ఒకప్పుడు చూసుకున్న నీచుడు చిన్న పిల్లల్లో అని కూడా చూడకుండా మానవత్వం మర్చిపోయి కన్న ప్రేమను వదిలేసి డాక్టరే ప్రియరాల కోసం భార్య పిల్లలను చంపేశాడు,
నీ భార్య పిల్లలను వదిలేసుకుంటే నిన్ను బాగా చూసుకుంటాను మనం కలిసి జీవితాంతం ఎంజాయ్ చేద్దామని చెప్పిన మాటలను నమ్మిన నీచుడు ప్రియురాలు చెప్పిందని హత్య చేశాడు ఆ తర్వాత కారును మరో మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి మంచుకొండ దగ్గర ఎడమ వైపు బలంగా చెట్టుకు కొట్టాడు రోడ్డు ప్రమాదంగా తెలివిగా భార్యా పిల్లలు చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు తీరిగ్గా కారు దిగి ఆ మృత దేహాలను కూడా కింద పడుకోబెట్టి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఆ తర్వాత కారు ప్రమాదానికి గురైందని బంధువులకు సమాచారం ఇచ్చాడు దారిన వెళ్ళే వాళ్ళు పోలీసులు సమాచారం ఇచ్చారు వేగంగా వస్తుంటే కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దానని చెప్పాడు అయితే చిన్నపిల్లకు గాని కుమారికి గాని ఒంటిపై చిన్న గాయం లేదు కానీ చనిపోయారు ఇటు ప్రవీణ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి అది కూడా చాలా తక్కువ రక్తం కూడా కారణంతగా దీంతో పోలీసులకు ఏదో అనుమానం కలిగింది,
గాయం లేకుండా ఎలా చనిపోయారు అనుకున్నారు అయితే బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు భర్తే భార్య పిల్లలను చంపి డ్రామాలు ఆడుతున్నాడని అతనిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని తండావాసులతో కలిసి ధర్నా చేశారు, పోలీసులకు కూడా తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు పోలీసులు ఫారెన్సిక్ టీం తో కలిసి క్షుణ్ణంగా వెతికారు అయితే వెనుక సీటు కింద ఖాళీ సిరంజి కనిపించింది ఇటు కుమారి తుంటిపై ఇంజెక్షన్ చేసిన మచ్చలు కూడా ఉండడంతో అనుమానం మరింత బలపడింది అవి ఇంజెక్షన్ వల్ల వచ్చిన మచ్చలేనని అనుమానించి ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపారు
ఇటు ప్రవీణ్ మాత్రం తానెందుకు చంపుతాను నాకు నా భార్య పిల్లలంటే ప్రాణం నా పిల్లలను నేను చంపుకునేంత నీచుడిని కానని కన్నీరు మున్నీరు అయ్యాడు కానీ కుమారి కుటుంబ సభ్యులు మాత్రం అతని మాటలు నమ్మలేదు నర్సు తో ప్రామాయణం విషయం కూడా పోలీసులకు చెప్పారు భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే విషయం గురించి కూడా ఫిర్యాదులో రాశారు ప్రవీణ్ మొదట తాను అమాయకుడినని బొంకాడు పోలీసులు పోస్ట్ మార్టం ఫారెన్సిక్ నివేదక వచ్చే వరకు వెయిట్ చేశారు ,
ఈ రెండు రిపోర్ట్లు కూడా 48 రోజులకు వచ్చాయి వాటిలో చాలా క్లియర్ గా ఇది హత్య అని తేలింది మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడం వల్లే చనిపోయారని తేలింది ఇక చిరంజీవిలో కూడా మత్తు మందు ఉందని ఆ మచ్చలు కూడా వాటి వల్లే వచ్చాయని తేలింది దీంతో ప్రవీణ్ ను తమదైన శలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు నీచుడు, తాను తన లవర్ చెప్పిందని భార్య పిల్లలను చంపానని పోలీసుల ముందు అంగీకరించాడు లవర్ కోసం బంగారం లాంటి భార్య పిల్లలను చంపుకోవడం ఏంట్రా నీచుడా అని పోలీసులు ఆశ్చర్యపోయారు డాక్టర్ వృత్తిలో ఉండి ఇంతటి దారుణాలు చేస్తావని తిట్టినా కూడా ఆ నీచుడు నుంచి మౌనమే సమాధానంగా ఎదురైంది ఏమనగా ప్రవీణ్ పై కేసు పెట్టిన పోలీసులు అతని ప్రియురాలను కూడా ఈ హత్య కేసులో చేర్చి ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు.
ఈ హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది 48 రోజుల క్రితం ప్రమాదంలో భార్య కూతుర్లు చనిపోయారని అందరిని నమ్మించే ప్రయత్నం చేసిన ప్రవీణ్ హంతకుడని తేలింది కేసు చేదనలో చురుకుగా పనిచేసిన ఇన్స్పెక్టర్ శ్రీహరి ఎస్ఐ సురేష్ అలాగే సిబ్బందిని ఏసీ పి అభినందించారు మరి నీచుడు డాక్టర్ ప్రవీణ్ ను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి